విజయనగరం జిల్లా గుర్ల మండలం తెట్టంగి పొలయవలస గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళుతున్న కూలీలపై ఒక దున్నపోతు దాడి చేసింది. ఈ దాడిలో కొనకని వెంకటలక్ష్మి (54) మృతి చెందింది. రోజూలాగే పనులకు వెళుతున్న సమయంలో అటుగా వచ్చిన దున్న పోతు వెంకట లక్ష్మీని పొడిచి శరీర భాగాలను వేరు చేసి కొంత దూరం వరకూ ఈడ్చుకెళ్ళిందని స్థానికులు తెలిపారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందారని, మిగతా మహిళలు భయపడి పరుగెత్తటంతో ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ఎస్ఐ లీలావతి, కుప్పిలి నాగేశ్వర్రావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఇది చదవండి రాజ్యాంగం ప్రకారం ఎవరి పరిధిలో వాళ్లుండాలి: సభాపతి తమ్మినేని