ETV Bharat / state

ఆస్ట్రేలియా నుంచి ఏపీకి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్..4కి చేరిన పాజిటివ్‌ కేసులు - ఆంధ్రప్రదేశ్ కరోనా తాజా వార్తలు

Andhra Pradesh corona updates: ఆస్ట్రేలియా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఓ మహిళకు కరోనా పరీక్షలు చేయగా.. పరీక్షలో కరోనా పాజిటివ్‌‌గా నిర్దారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు. సింగపూర్‌ మీదుగా విశాఖకు వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌ రాగా.. బాధితురాలి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. రిపోర్టుల్లో వారికి కరోనా నెగెటివ్‌గా వచ్చిందన్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉందని, నమూనాను జీనోమ్‌ స్వీకెన్సీ కోసం విజయవాడ తెప్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.

corona positive case
ఆస్ట్రేలియా నుంచి మహిళకు కరోనా
author img

By

Published : Jan 4, 2023, 8:16 AM IST

Andhra Pradesh corona updates: ఆస్ట్రేలియా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారిలో ఒకరికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి సింగపూరు మీదుగా విశాఖ విమానాశ్రయం ద్వారా వచ్చిన ప్రయాణికుల నుంచి నమూనాలను సేకరించి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో ఒకరికి పాజిటివ్‌‌ వచ్చిందని తెలిపారు. మహిళతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు జరపగా.. రిపోర్టుల్లో వారికి నెగిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

''పాజిటివ్‌ వచ్చిన మహిళ విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఉన్నట్లు తెలిసింది. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్న ధ్రువ పత్రంతో ఆమె ఏపీకి వచ్చారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉంది. జిల్లా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆమె నమూనాను జీనోమ్‌ స్వీకెన్సీ కోసం విజయవాడ తెప్పించాం.'' అని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు అనకాపల్లి జిల్లాలోని స్థానికుల్లో ఒకరికి కొవిడ్‌ సోకింది. సోమవారం ఉదయం 10 నుంచి మంగళవారం ఉదయం పది గంటల మధ్య 492 నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లో పరీక్షించగా.. ఈ కేసులు బయటపడ్డాయి. ఇవికాకుండా 1,381 ర్యాపిడ్‌ టెస్టులు చేయగా కొత్త కేసులు ఏమీ బయటపడలేదు. కొత్తగా వచ్చిన రెండు కేసులతో కలిపి రాష్ట్రంలో ప్రస్తుతం 4 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 23,39,071 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.