భర్త చేతిలో భార్య దారుణంగా హత్యకు గురయిన ఘటన విజయనగరం జిల్లా సాలూరు కోటవీధిలో జరిగింది. కోటవీధికి చెందిన పావని.. తన భర్త తిరుపతితో కలిసి నివసిస్తోంది. తిరుపతి ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా తిరుపతికి.. భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానం వచ్చింది. ఆ అనుమానంతోనే పావనితో ఘర్షణకు దిగాడు. ఈ గొడవలో తిరుపతి తన భార్య పావనిని తాడుతో రెండు చేతులు కట్టేసి నోట్లో యాసిడ్ పోసి దారుణంగా హత్య చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని గుర్తించి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి.