విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పర్యటించారు. 'జగనన్న గోరుముద్ద' పథకంలో భాగంగా కొత్త మెనూ అమలుతీరును పరిశీలించేందుకు ఆమె పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనాన్ని రుచి చూశారు. ఆహార నాణ్యతపట్ల అసంతృప్తి, నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు పొడిచే విధానాలను సహించేదిలేదని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించారు.
ఇదీచదవండి.'అవునా... సీఎం జగన్కు డాక్టరేట్ వచ్చిందా..?'