ఇళ్ల స్థలాల విషయంలో వస్తోన్న కథనాలపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. ఇంటి స్థలాల కోసం వచ్చిన వినతుల మేరకు 56,935 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. వీరందరికీ.. 1.5 సెంట్ల భూమిని అందజేసేందుకు 1,358 ఎకరాలు గుర్తించామన్నారు. స్థలాల కొనుగోలుకు రూ.195 కోట్లు అవసరం కాగా.. సేకరించిన భూమిని చదును చేయడం, రాళ్లు పాతటం వంటి పనుల నిమిత్తం ప్రభుత్వం ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేసిందన్నారు.
ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వ భూమి అందుబాటులో లేని చోట నిర్మాణానికి అనువైన డీ - పట్టా లేదా జిరాయితీ భూమిని సేకరిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. భూ సేకరణకు ఎంపిక చేసిన ప్రాంతంలో సంబంధిత భూ యజమాని పూర్తి అంగీకారంతోనే భూమిని సేకరిస్తున్నామని తెలిపారు. డీ - పట్టాదారులకు మార్కెట్ విలువకు రెండున్నర రెట్లు అధికంగా పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి భూ సేకరణలో ఎక్కడా బలవంతపు సేకరణకు పాల్పడలేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: