Police Arrested Two Men in Drugs Case: విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్ఎస్డీ డ్రగ్స్ కలకలం రేపింది. రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో నిందితులు ఈ పని చేస్తున్నారని జిల్లా ఎస్పీ దీపిక స్పష్టం చేశారు.
విజయనగరం ఉల్లివీధికి చెందిన కొండపు సందీప్ రెడ్డి, కుమ్మరి వీధికి చెందిన శఠగోపం గణేష్ విజయనగరంలోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇదే వేడుకకు విశాఖపట్నం ఐటీ ప్రాంతనికి చెందిన వ్యక్తి హాజరయ్యాడు. అతడు విలాసవంతగా జీవిస్తున్నట్లు గుర్తించిన నిందితులు.. అతనితో స్నేహం పెంచుకున్నారు. సులభంగా నగదు సంపదించాలనే ఆశతో అతని సలహా మేరకు డ్రగ్స్ సప్లై చేసేందుకు ఆసక్తి కనబర్చారు. అందులో భాగంగా సందీప్ రెడ్డి, గణేష్‌లు విశాఖపట్నంకు చెందిన వ్యక్తికి ఆన్లైన్లో నగదు చెల్లించారు. అతను కొరియర్ ద్వారా వీరికి ఎల్ఎస్డీ డ్రగ్స్‌ను పంపించాడు. ముందస్తు సమాచారంతో నిందితుల్ని పార్శిల్ సెంటర్ నుంచి కొరియర్ తీసుకెళ్తున్న సమయంలో పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి 65 బిళ్లల ఎల్ఎస్డీ డ్రగ్స్, ఒక వాచీ స్వాధీనం చేసుకున్నట్లు.. దీని విలువ సూమారు రూ.రెండున్నర లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల్ని లోతుగా విచారించి సూత్రదారుల్ని పట్టుకోనున్నట్లు ఎస్పీ దీపిక తెలిపారు.
ఇవీ చదవండి: