మూడో దశ కరోనా వ్యాప్తిని ఎదుర్కొనేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై.. విజయనగరం జిల్లా స్థాయి కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమైంది. కలెక్టర్ హరిజవహర్‌లాల్ అధ్యక్షతన జరిగిన భేటీకి.. ఉన్నతాధికారులు సహా చిన్నపిల్లల వైద్య నిపుణులు హాజరయ్యారు. జిల్లాలో 18 ఏళ్లలోపు పిల్లలు దాదాపు 5లక్షల మంది ఉన్నారని.. పిల్లల వయసు, ఆరోగ్యం, మానసిక స్థితిని బట్టి కార్యాచరణ ఉండాలని వైద్యులు సూచించారు.
మూడో దశపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు వైరస్ బారిన పడకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులకు వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అభిప్రాయపడ్డారు. జిల్లాలో కొవిడ్ మూడో దశ ముప్పు తప్పించేందుకు సిద్ధంగా ఉండాలన్న కలెక్టర్ హరిజవహర్‌లాల్..ప్రభుత్వ శాఖలు, వైద్య నిపుణలు చర్చించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.మూడో దశ కట్టడిలో భాగంగా.. వారానికి రెండుసార్లు జ్వరాల సర్వే నిర్వహించాలని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: