కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు, ఆసుపత్రుల సన్నద్దత తదితర అంశాలను వివరించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ విజయనగరం కలెక్టరేట్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మహేష్‌కుమార్ మాట్లాడుతూ కరోనా వ్యాధి అంత ప్రమాదకరం కాదన్నారు. అయితే ఇది ఒకరినుంచి ఒకరికి త్వరగా వ్యాపిస్తుందని చెప్పారు. ఈ వ్యాధి సోకినవారిలో మరణాలు 2శాతం కంటే తక్కువేనని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాధి ప్రతీఒక్కరికీ సోకే అవకాశం ఉందని, నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
'కోవిడ్ బాధితులకు 2 వేల ఆర్థికాసాయం'
వృద్దులు, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రమే వైద్యుల పర్యవేక్షణ అవసరమన్నారు. మరణాలను తగ్గించేందుకు అన్నివిధాలా చర్యలను తీసుకున్నామన్నారు. కోవిడ్ చికిత్స పూర్తి చేసుకున్న రోగులకు ప్రభుత్వం ఇచ్చే రూ.2వేల ఆర్థిక సహాయాన్నినేరుగా వారి ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కరోనా వ్యాధికి చికిత్సను దశలవారీగా మరిన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్కు ఆసుపత్రులకు విస్తరిస్తామని చెప్పారు.
లక్షణాలుంటే పరీక్షలు తప్పనిసరి
కరోనా నిర్ధారణ అయినప్పటికీ, ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్‌లో ఉండాలని, వారికి అవసరమైన కిట్‌లను అందజేస్తామని చెప్పారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన వారు త్వరగా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. కోవిడ్‌కు సంబంధించిన సహాయం, సమాచారం, ఇతర వివరాలకోసం హెల్పైలైన్ నెంబర్లు 08922-275278, 08922-275279, 08922-275280 కు సంప్రదించాలని సూచించారు.
ఇవీ చదవండి