విజయనగరం జిల్లా సాలూరు మండలం వెంకన్నబండ చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో చిన్నపిల్లల్ని తీసుకుంటున్నారు. వారి వయసు 12 నుంచి 15 ఏళ్ల లోపే ఉంటుంది. దీనిపై అక్కడ సిబ్బందిని ప్రశ్నించగా.. వారి తల్లిదండ్రులకు జాబ్ కార్డులు ఉన్నాయని.. వారు పనిలోకి రాకపోవటంతో పిల్లలు వస్తున్నారని చెప్పారు.
బాలబాలికలతో కేంద్రప్రభుత్వ పనులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీఓ సుశీల స్పందిస్తూ ఈ సమస్య తమ దృష్టికి రాలేదని తెలిపారు. తాను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పిల్లలతో పనులు చేయిస్తున్నట్లు తేలితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇవీ చదవండి..