విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని స్వగ్రామం సీతానగరంలో విషాదం అలుముకుంది. పార్వతీపురం నియోజకవర్గం సీతానగరానికి చెందిన దేవులపల్లి వెంకట కిషోర్(45) అమెరికాలోని డల్లాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కిషోర్ ఉద్యోగరీత్యా కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్నారు.
వినాయక చవితి వేడుకలకు పిల్లలతో కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట కిషోర్ మృతి చెందగా.. పిల్లలు క్షేమంగా ఉన్నారని బంధువులు తెలిపారు.
ఇదీ చూడండి. రాజధాని అంశం కేంద్ర పరిధిలో లేదనటం సరికాదు: జీవీఆర్ శాస్త్రి