ETV Bharat / state

'దాతల సహాయంతో చదివి.. ఈ స్థాయికి చేరుకున్నా' - న్యూస్ టుడేతో సంయుక్త కలెక్టర్‌ జీసీ కిశోర్‌కుమార్‌ తాజా వార్తలు

"ప్రజలకు సేవ చేయడానికి దేవుడు ఈ హోదా ఇచ్చాడు. అందుకు జీతమూ ఇస్తున్నాడు. అంతకంటే ఏం కావాలి? ఎన్నో కష్టాలను, ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా.. దాతలు ఫీజులు కడితే చదువుకునే వాడిని.. మరొకరు ఉపయోగించిన పుస్తకాలను తక్కువ ధరకు కొనుక్కొనేవాడిని. ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు.. అందుకే ఎవరికి కష్టమన్నా ముందుంటా" అంటూ.. భావోద్వేగానికి గురయ్యారు విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్‌ (రెవెన్యూ) జీసీ కిశోర్‌కుమార్. తను ఈ స్థాయికి రావడానికి పడిన కష్టంతో పాటు మరిన్ని అభిప్రాయాలను ఈనాడుతో పంచుకున్నారు. ఆ అనుభవాలన్నీ... ఆయన మాటల్లోనే.

vizianagaram district JC Kishore kumar
జిల్లా సంయుక్త కలెక్టర్‌ (రెవెన్యూ) జీసీ కిశోర్‌కుమార్‌
author img

By

Published : Dec 6, 2020, 4:53 PM IST

మాది ఏలూరు. మా నాన్న చిన్న గుమస్తా. తల్లి ఇందిరావతి గృహిణి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువే. తెలిసినవారు నాకు ఫీజులు కట్టేవారు. సీనియర్లు ఉపయోగించిన పాఠ్య పుస్తకాలను తక్కువ ధరకు కొనుగోలు చేసుకునేవాడిని. ఇలా బీఏ వరకూ అక్కడే చదివా. తర్వాత కాకినాడ పీజీ సెంటరులో ఎంఏ పూర్తి చేశా. కొన్నాళ్లు ఇంజినీరింగు కళాశాలలో సహాయ ఆచార్యులుగా పని చేశా. పోషణ కోసం ఉదయమంతా కళాశాలలో పని చేసేవాడిని. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్యూషన్లు చెప్పి.. రాత్రి వేళల్లో నా లక్ష్యం కోసం కష్టపడ్ఢా హైదరాబాద్‌లో ఈ విధంగా ఏడేళ్లు శ్రమించా. అలా చేస్తూనే ఎంఏ ఆంగ్లంలో పీహెచ్‌డీ అయ్యింది. 2007లో గ్రూప్‌-1 సాధించి ఉపకలెక్టరుగా వచ్చా 2014లో ఐఏఎస్‌ అయ్యా.

సేవలోనే ఆనందం..

అమ్మానాన్నలకు సేవాగుణం ఎక్కువ. ఆ ఆలవాటే మాకూ వచ్చింది. అందుకే ఎవరికి కష్టం ఉందన్నా వెంటనే చలించిపోతా. అదృష్టవశాత్తు నా భార్య సత్యదీపికకూ అలాంటి మనస్తత్వమే ఉంది. తనే స్వయంగా ఆహారం తయారు చేసి రహదారులపై ఉండే నిరాశ్రయులకు పంచిపెట్టిన సందర్భాలు అనేకం. పెళ్లి రోజు, పిల్లల పుట్టిన రోజు, ఇంకా ఏ ఇతర వేడుకలైనా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లోనే జరుపుకొంటాం. మా పిల్లలు లోచన్‌ అభిషిక్త్‌, దేవాన్షి ప్రార్థనలకూ అటువంటి సేవాగుణమే అలవడుతోంది.

ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతోంది..

ఆర్డీవోగా పని చేసిన సమయంలో ఓ వ్యక్తి భూసమస్యపై నా వద్దకు వచ్చారు. నేను వెంటనే తహసీల్దారుకు చెప్పాను. కొన్నాళ్ల తర్వాత ఆ వ్యక్తి చనిపోయారని తెలిసింది. అతను బతికుండగా న్యాయం చేయలేకపోయామే? అన్న బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది. నా జీవితంలో మర్చిపోలేని ఘటన అది. బాధితులకు త్వరగా న్యాయం చేయలేకపోతే ఈ ఉద్యోగం ఎందుకు?

వయసు మేనేజ్‌మెంట్‌ చేసుకోవాలి..

నేటి యువత చాలా వరకూ తప్పిదాలు చేస్తున్నారు. చదువుకునే వయసులో ఆడుకుంటున్నారు. పెళ్లి చేసుకునే వయసులో చదువుకుంటున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల అవకాశాలు తగ్గిపోతాయి. ఏ వయసులో చేయాల్సిన పనులు అప్పుడే చేయాలి. ఇది ఆశ్రమ ధర్మం. యువతకు నేనిచ్చిన సలహా అదే.

చదవడమంటే ఇష్టం..

చదవడమంటే చాలా ఇష్టం. ఇప్పటికీ చదువుతూనే ఉన్నా. ఎంబీఏలో పీహెచ్‌డీ చేస్తున్నా. ఒకప్పుడు సినిమాలకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు అంత తీరిక ఉండటం లేదు. టీవీలో ఎక్కువగా హిస్టరీ, నేషనల్‌ జియోగ్రఫీ, డిస్కవరీ ఛానళ్లు చూస్తుంటాను, చరిత్ర, ఖగోళ శాస్త్రం అంటే ఎక్కువ ఇష్టం. ఆ పుస్తకాలే అధికంగా చదువుతా. ఇప్పటికీ నా మంచంపై పుస్తకం ఉంటుంది. ప్రస్తుతం ‘ది లాస్ట్‌ మొగల్‌’ చదువుతున్నా.

మటన్‌ బిర్యానీ బాగా చేస్తా..

వంట చేయడం బాగా వచ్ఛు మటన్‌ బిర్యానీ బాగా చేస్తా.. అంతకంటే ఇష్టంగా తింటా. కొండకోనలు, గుహలను సందర్శించడం ఇష్టం. బౌద్ధారామాలు సందర్శిస్తుంటాను. సాధారణంగా ఉండటానికే ఇష్టపడతా. తోటి ఉద్యోగులను సైతం అన్నా, తమ్ముడు అని ఒక కుటుంబ సభ్యుడిలా సంబోధిస్తా.

ఇవీ చూడండి:

'పారిశుద్థ్య పక్షోత్సవాలను విజయవంతం చేయాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.