కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రాజమహేంద్రవరంలో కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జాంపేట గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా.. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వ్యవసాయ వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని... వ్యవసాయాన్ని, రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.