ETV Bharat / state

'కోర్టు ఆదేశాల్లో అప్రమత్తంగా ఉండకుంటే చిక్కులు తప్పవు' - విజయనగరం జిల్లాలో కొవిడ్‌ మూడో దశ

కోర్టు కేసుల‌కు సంబంధించి న్యాయ‌స్థానం ఆదేశాల‌ను తప్పనిసరిగా అమ‌లు చేయాల‌ని అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులకు కలెక్టర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ సూచించారు. కోర్టు ఉల్లంఘ‌న‌కు సంబంధించిన కేసుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించాలని అన్నారు. కోర్టు కేసుల విష‌యంలో సక్ర‌మంగా, స‌కాలంలో స్పందించ‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అధికారులకు హెచ్చ‌రించారు.

vizianagaram collector review
కలెక్టర్ హ‌రి జ‌వ‌హ‌ర్ సమీక్ష
author img

By

Published : Jul 13, 2021, 10:12 PM IST

వివిధ కేసుల‌కు సంబంధించి కోర్టులు ఇస్తున్న ఆదేశాల‌ను, సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌లు అమ‌లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ స‌మావేశ‌ మందిరంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో, ప‌లు అంశాల‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. కోర్టు కేసుల‌కు సంబంధించి న్యాయ‌స్థానం ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని, అమ‌లు చేయ‌లేని ప‌క్షంలో సంబంధిత ప్ర‌భుత్వ న్యాయ‌వాది ద్వారా కోర్టుకు కార‌ణాల‌ను తెలియ‌జేయాల‌ని సూచించారు. కోర్టు ఉల్లంఘ‌న‌కు సంబంధించిన కేసుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించి, న్యాయ‌ప‌రంగా త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. అన్ని శాఖ‌ల్లోనూ కోర్టు కేసుల‌ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండి, నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. కోర్టు కేసుల విష‌యంలో సక్ర‌మంగా, స‌కాలంలో స్పందించ‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూకి సంబంధించిన కేసుల‌పై జిల్లా రెవెన్యూ అధికారిని, రెవెన్యూయేత‌ర కేసుల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం)ని ముందుగా సంప్ర‌దించి, వారి స‌ల‌హా ప్ర‌కారం న్యాయ‌ప‌రంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ప్ర‌భుత్వ శాఖ‌లన్నీ, బ్యాంకుల్లో ఉంచిన త‌మ‌ డిపాజిట్ల వివ‌రాలు వెంట‌నే అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఏయే బ్యాంకుల్లో ఎంత డిపాజిట్ ఉన్న‌దీ, అది ఏ రూపంలో ఉన్న‌దీ, వ‌డ్డీ ద్వారా వ‌చ్చిన ఆదాయం త‌దిత‌ర వివ‌రాల‌ను నిర్ణీత న‌మూనాలో నింపి, మంగ‌ళ‌వారం సాయంత్రానికి అంద‌జేయాల‌ని సూచించారు.

సున్నా కేసులే లక్ష్యం..

జిల్లాలో కొవిడ్‌ మూడో దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు.. జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్లు.. కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలిపారు. మూడో దశలో సున్నా మరణాలే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్ర‌తీ ప్ర‌భుత్వ కార్యాల‌యంలో కోవిడ్-19 నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిసరిగా అమ‌లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ అన్నారు. ప్ర‌తీఒక్క‌రూ మాస్కును ధ‌రించేలా చూడాల‌ని, లేకపోతే రూ.100 జ‌రిమానా విధించ‌డం జరుగుతుంద‌ని హెచ్చ‌రించారు. మూడోద‌శ విజృంభించే అవకాశం ఉండటంతో త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌క‌పోతే తీవ్ర‌మైన న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని.. ప్ర‌జ‌లంతా స్వీయ నియంత్ర‌ణ పాటించేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

ఇదీ చదవండి:

Minister Buggana: 'రూ.41 వేల కోట్లకు లెక్కలున్నాయి.. అర్థరహిత విమర్శలొద్దు'

FRAUD: తైలాల పేరుతో రూ.52 లక్షలు కొల్లగొట్టారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.