ETV Bharat / state

'విద్యార్థుల‌ను సొంత పిల్ల‌ల్లా చూసుకోవాలి'

author img

By

Published : Feb 20, 2021, 2:15 PM IST

విద్యారంగ‌లో ఎలాంటి మార్పు అయినా విజయనగరం జిల్లా నుంచే ప్రారంభం కావాలని క‌లెక్ట‌ర్ హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ఆకాంక్షించారు. నాడు - నేడు ప‌థ‌కం, ఇతర పనుల ప్రగతిపై జిల్లాలోని ఉన్న‌త పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపా‌ధ్యాయుల‌తో సమావేశం నిర్వహించారు.

vizaianagaram collector  review   on government schemes
ప్ర‌ధానోపా‌ధ్యాయుల‌తో విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ సమీక్ష

విజయనగరం జిల్లాలో నాడు - నేడు ప‌థ‌కం, ఇతర సంక్షేమ కార్యక్రమాల పనులపై జిల్లాలోని ఉన్న‌త పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపా‌ధ్యాయుల‌తో క‌లెక్ట‌ర్ హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ సమావేశం నిర్వహించారు. ఆరోగ్య క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో విద్యార్థుల‌కు విద్య‌ను అందించినప్పుడే ఉన్నతి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో విద్య‌ను అందించాల‌ని, అందుకు త‌గిన ఏర్పాట్లు చేసుకోవాల‌ని ప్ర‌ధానోపాధ్యాయుల‌కు సూచించారు.

ప్ర‌తి పాఠ‌శాల‌లో ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నం-ప‌రిర‌క్ష‌ణ‌, ప‌రిపూర్ణ ఆరోగ్య సూత్రాల‌ను పాటించాలని అన్నారు. విధిగా ప్ర‌తి పాఠశాల‌లో మొక్క‌ల‌ను నాటి సంర‌క్షించాల‌ని ఆదేశించారు. విద్యార్థుల‌కు అందిస్తున్న మ‌ధ్యాహ్న భోజ‌నంలో నాణ్య‌త ఉండాల‌ని, మంచి ఆహారం అందించాల‌ని చెప్పారు. అలాగే ప్ర‌తి ఉపాధ్యాయుడూ బాధ్య‌త‌గా మెల‌గాల‌ని.. విద్యార్థుల‌ను సొంత పిల్ల‌ల్లా చూసుకోవాలని సూచించారు. జూన్ మొద‌టి వారంలో జరిగే, ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌ల‌కు ఇప్ప‌టి నుంచే విద్యార్థులకు త‌గిన త‌ర్ఫీదు ఇవ్వాల‌ని ఆదేశించారు.

ఇదీ చూడండి:

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. విజయసాయి పాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.