ETV Bharat / state

రహదారిపై వర్షం నీటితో ప్రజల తీవ్ర అవస్థలు - మామిడిపల్లిలో వర్షం నీటితో అవస్థలు

రహదారి పొడవున వర్షం నీరు చేరి..కాలు సైతం పెట్టడానికి వీలులేని విధంగా మురుగు తయారవుతున్నా, అధికార్లలో చలనం రావడంలేదు. విజయనగరం జిల్లా సాలూరులోని మామిడి పల్లి,శంబర మద్య ఉన్న రహదారిపై 20 రోజులుగా నీరు నిలచి ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

అవస్థలు పడుతున్నాం...స్పందించండి..
author img

By

Published : Oct 11, 2019, 12:32 PM IST

అవస్థలు పడుతున్నాం...స్పందించండి..

విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడి పల్లి,శంబర మద్య ఉన్న రహదారిపై వర్షం నీరు నిలచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు కిలోమీటర్ల మేర నీరు నిలచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాలకు ఉన్న ఏకైక మార్గంపై భారీ స్థాయిలో నిలచి ఉన్నా, అధికార్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. భారీగా నీరు చేరితే గతంలో కల్వర్టు ద్వారా ఊరి చివర ఉన్న బంధ చెరువులోకి మళ్లించేవారు. అయితే, కొంతమంది కల్వర్టును కబ్జా చేయడంతో నీరు రోడ్లపైనే నిలచిపోతోందని ప్రజలు ఆరోపించారు. అధికార్లు ఇప్పటికైన స్పందించి, తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి : కురపాంలో ఏనుగుల హల్​చల్​

Intro:Body:

vzm_08_10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.