మద్యం ఎన్నో జీవితాలను నాశనం చేస్తోంది. విజయనగరం జిల్లా సాలూరు మండలం తోణాం పంచాయతీలో అలానే ఎన్నో కుటుంబాలు మద్యం కారణంగా మసకబారాయి. చివరికి ఆ గ్రామస్థులు ఓ తీర్మానం చేశారు. మద్యం అమ్మడమే కాదు..ఎక్కడ.. తాగినా.. తమ ఊరికి రావద్దంటూ మాట కట్టడి చేశారు. ఒకవేళ వస్తే.. 5 వేలు జరిమానా తప్పదంటూ తీర్మానం చేశారు.
విజయనగరం జిల్లా సాలూరు మండల తోణాం పంచాయతీ పరిధిలో ఉన్న మెట్టవలస గ్రామంలో మహిళా సంఘాలు.. ఈ మేరకు తీర్మానం చేశాయి. చాలామంది కాపురాలు మద్యం కారణంగా నాశనం అవుతున్నాయని గుర్తించారు మహిళలు. సారా ఏరులై పారుతుంటే మగవారు పనికి వెళ్లకుండా... ఇంటి వద్దే గొడవలు చేస్తూ ఉండేవారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా మెట్టవలసలో తాగుడుకు బానిసయ్యారు. ఇలా చూస్తూ ఊరుకుంటే తమ కుటుంబాలు నాశనమవుతున్నాయని ఓ నిర్ణయనికొచ్చారు. 60 రోజుల క్రితమే మా ఊరికి మద్య వద్దు అంటూ..తీర్మానం చేశారు. ఇప్పుడు తాజాగా తామ గ్రామంలోకి అసలు మద్యం తాగి రావద్దంటూ తీర్మానం చేశారు. వస్తే 5వేల జరిమానా కట్టాల్సిందేనని నిర్ణయించారు.
ఇదీ చదవండి: