విజయనగరం జిల్లాలో మొత్తం జడ్పీ స్థానాలను వైకాపా కైవసం చేసుకోవటం పార్టీ ప్రతిష్ఠను మరింత పెంచిందని మంత్రి బొత్స సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకంతో జిల్లా ప్రజలు పార్టీకి పట్టం కట్టారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. ఎంపికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు పాలన చేయాలని సూచించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
విజయనగరంజిల్లాలో నూతనంగా ఎంపికైన జడ్పీటీసీ, ఎంపీపీలను.., మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు. విజయనగరంలోని ఎమ్మెల్యే అప్పల నరసయ్య స్వగృహంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు.., ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, ఎంపీ బెల్లాన, ఎమ్మెల్సీ సురేష్ బాబు, పలువురు వైకాపా నేతలు, నూతనంగా ఎంపికైన జడ్పీటీసీ, ఎంపీపీలు హాజరయ్యారు.
జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కో-ఆప్డెడ్ సభ్యులను మంత్రి బొత్స ప్రకటించారు. జడ్పీ ఛైర్మన్‌గా మజ్జి శ్రీనివాస రావు, వైస్ ఛైర్మన్లుగా బాపూజీ నాయుడు, అంబటి వెంకట అనిల్ కుమార్ పేర్లు ప్రకటించారు. కో-అప్టెడ్ సభ్యులుగా షేక్ నిసార్, షేక్ మదీనా పేర్లను బొత్స ప్రకటించారు.
ఇదీ చదవండి: