విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిజన గ్రామాల్లో రహదారులు ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మండలంలోని కరడవలస, జిల్లేడువలస గ్రామాల్లోని 100 కుటుంబాలు ఒక్కో ఇంటికి రూ.3 వేల చొప్పున చందాలు వసూలు చేస్తున్నారు. అధికారులు ఎవరూ తమ గ్రామాలకు రాకపోవడంతో ఇలా వసూలు చేసుకుంటున్నామని గ్రామీణులు తెలిపారు. ఆది, సోమవారాల్లో పొక్లెయిన్ సాయంతో పనులు చేశారు. జిల్లేడువలస పంచాయతీ నారింజపాడులోని 30 గ్రామాల ప్రజలు సమావేశం ఏర్పాటు , చందాలు సేకరించి రహదారి వేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సిరివర, కొదమలో ఇలా రహదారులు నిర్మించుకున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండీ...