విజయనగరంలోని జ్ఞాన సరస్వతీ ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల విద్యలకు అధిదేవత అయిన అమ్మవారి విగ్రహాన్ని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, ఫల, పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం.. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా.. ఒడిశా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచీ భారీగా భక్తులు తరలొచ్చారు. సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొని.. తమ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం.. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీచదవండి..మహాత్మునికి గవర్నర్ బిశ్వభూషణ్ నివాళులు