ETV Bharat / state

'ప్రజలందరూ భారత్​ బంద్​కు మద్దతివ్వాలి' - భారత్ బంద్ వార్తలు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు తలపెట్టిన భారత్ బంద్​కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని.. పలు ప్రజా సంఘాలు, వామపక్షాలు కోరాయి. ఆ బిల్లులను రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి విజ్ఞప్తి చేశారు.

bharat bundh
భారత్ బంద్
author img

By

Published : Dec 7, 2020, 4:32 PM IST

విశాఖ జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు రైతులు నిర్వహించబోయే భారత్ బంద్​లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విశాఖలో సీఐటీయూ కార్యకర్తలు పిలుపునిచ్చారు. మోదీ సర్కారు తీరును నిరసిస్తూ మద్దిలపాలెం కూడలిలో ఆందోళన చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ గత 12 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే.. భాజపా ప్రభుత్వం ఎటూ తేల్చకుండా తాత్సారం చేయడం సమంజసం కాదని సీఐటీయూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రేపు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్​కు పూర్తి మద్దతు ప్రకటించారు.

విజయనగరం జిల్లాలో..

భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ... రేపు జరగబోయే భారత్ బంద్​కు రైతు సంఘాలిచ్చిన పిలుపునకు మద్దతుగా అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, నవయువ సమాఖ్య ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కేంద్రం తీసుకువచ్చిన 3 వ్యవసాయ బిల్లులతో దేశంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సమాఖ్య నాయకులు అన్నారు. ఈ బిల్లులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లాలో..

రేపు జరగనున్న భారత్ బంద్​కు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతివ్వాలని అనంతపురం జిల్లా సీపీఐ, సీపీఎం నేతలు కోరారు. మోదీ ప్రభుత్వం రైతుల వ్యతిరేక బిల్లులను ప్రవేశపెట్టి వారికి నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

రేపు భారత్ బంద్.. ఎక్కడి లారీలు అక్కడే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.