విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద గిరిజన ఆశ్రమ పాఠశాల సీఆర్టీ, భాషా వాలంటీర్లు ఆందోళనకు దిగారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన సీఆర్టీలు, భాష వాలంటీర్లు, ఏఎన్ఎంలు ఆకలి యాత్ర కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఐటీడీఏ కార్యాలయం వద్ద ఖాళీ పళ్లేలతో నిరసన చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ప్రధాన రహదారిలో ఖాళీ పళ్లేలతో ప్రదర్శన చేస్తూ ఆర్టీసీ కూడలి వరకు ఆకలి యాత్ర చేపట్టారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ మోహన్ రావు పాల్గొన్నారు. తమను రెన్యువల్ చేయాలని కోరుతూ గత నాలుగు నెలలుగా అనేక విజ్ఞప్తులు చేశామని ఆందోళనల్లో పాల్గొన్న వారు చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమను రెన్యువల్ చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: AOB: 'ఆంధ్రాలోనే ఉంటాం.. కొఠియా ప్రాంత గ్రామస్తుల తీర్మానం'