పిల్లలపై మూడో దశ కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో... రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులపై, వారి తల్లులపై దృష్టి సారించింది. ఈ మేరకు ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు టీకా వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారి కోసం విజయనగరం జిల్లాలో ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పల్స్ పోలియో జాబితా ప్రకారం.... జిల్లాలో లక్షా 80వేల మంది తల్లులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరికి వ్యాక్సిషన్ అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీకా వేసుకునేందుకు తొలిరోజు చిన్నారుల తల్లులు కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలొచ్చారు.
ఇదీచదవండి: fire at kaza toll gate: మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్ వద్ద అగ్నిప్రమాదం