గత ప్రభుత్వ హయాంలోనే పోలవరం తొలిదశ పనులు సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టారు. ఇందులో పెండింగ్ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి చేపడుతున్నారు. రెండో దశలో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన పనులకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిని ఆరు ప్యాకేజీలుగా విభజించారు. తొలి రెండు ప్యాకేజీల్లో సుమారు 100 కి.మీ పొడవున ప్రధాన కాలువల నిర్మాణానికి డిసెంబరు మొదటి వారంలో టెండర్లు పిలవనున్నారు. రెండోదశ పనుల్లో భాగంగా జిల్లాలో పలు చోట్ల జలాశయాలు, కాలువలు, ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నారు.
భూసేకరణపై ప్రత్యేక దృష్టి
ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే సుమారు 30 వేల ఎకరాలకుపైగా భూములు అవసరం అవుతాయి. నాలుగు పెద్ద జలాశయాలతో పాటు సుమారు 120 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వాల్సి ఉంటుంది. విశాఖ జిల్లాలో 1.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు తలపెట్టిన మొదటిదశ పనులకే సుమారు 4,272 ఎకరాల భూములు అవసరం అవుతున్నాయి. రెండోదశలో చేపట్టబోయే జలాశయాలు, కాలువ నిర్మాణానికి మరో 26 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది.
భారీగా భూములు సేకరించాల్సిన అవసరం ఉండడంతో ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా డిప్యూటీ కలెక్టర్లను నియమించాలని సంబంధిత శాఖ ప్రభుత్వాన్ని కోరింది. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలోని కొత్తవలస కేంద్రంగా ఈ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జలవనరుల శాఖలోని వివిధ ప్రాజెక్టుల్లో తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లు ఖాళీగా ఉన్నారు. వారిలో ముగ్గురిని ఈ ప్రాజెక్టుకు నియమించే అవకాశం ఉంది. అధికారులు అందుబాటులోకి వచ్చాక భూసేకరణ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని సుజల స్రవంతి ప్రాజెక్టు ఈఈ చంద్రరావు చెబుతున్నారు.
టెండర్లు పూర్తి కాగానే పనులు
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంతో జిల్లాకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. రెండో దశ పనులకు టెండర్లు ఖరారు కాగానే పనులు ప్రారంభమవుతాయి. వీటిని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తాం. - పి.చంద్రరావు, ఈఈ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం
జిల్లాలో సుజల స్రవంతి స్వరూపం ఇలా...
ఇవీ చూడండి:
విశాఖ–ఛత్తీస్‌గఢ్ రహదారి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు