విజయనగరం జిల్లా గరివిడి మండలం తొండంగిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మట్టిదిబ్బలు కూలి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మీ, సూరీడమ్మాలు మాంగనీస్ వ్యర్థాల డంపింగ్ యార్డులో మాంగనీస్ వెతుకులాట కోసం వెళ్లారు. ఆ సమయంలో మట్టిదిబ్బలు కూలటంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్న గరివిడి పోలీసులు మట్టిలో కూరుకుపోయిన వారిని వారిని వెలికి తీశారు. వారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీచదవండి