ETV Bharat / state

ACCIDENT: విజయనగరం జిల్లాలో కారు-ఆటో-బస్సు ఢీ... ముగ్గురు మృతి - crime news in vizianagaram-district

కారు-ఆటో-బస్సు ఢీ... ఇద్దరు మృతి
కారు-ఆటో-బస్సు ఢీ... ఇద్దరు మృతి
author img

By

Published : Oct 5, 2021, 4:25 PM IST

Updated : Oct 5, 2021, 9:34 PM IST

16:22 October 05

విజయనగరం జిల్లా బోడసింగిపేటలో ఘటన

కారు-ఆటో-బస్సు ఢీ... ముగ్గురు మృతి

 విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బోడసింగిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఆర్టీసీ బస్సు - కారు - ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి(three people death) చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.  

 విజయనగరం నుంచి గజపతినగరం వస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కారు అదుపు తప్పి, గజపతినగరం  నుంచి వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో.. వెనక పార్వతీపురం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కిందికి దూసుకుపోయింది. దీంతో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి ఘటనాస్థలంలోనే మృతి(death) చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు గాయాలయ్యాయి. చికిత్స కోసం విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని గజపతినగరం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స(first aid) అనంతరం విజయనగరం తరలించారు. బస్సు కిందకు ఆటో దూసుకుపోవడంతో ఆటో నుంచి మృతదేహం(dead body) తీసేందుకు పోలీసులు, స్థానికులు గంటన్నరపాటు శ్రమించారు. కారు అతివేగమే(car over speed) ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

మృతులు సాలూరుకు చెందిన శేఖర్, దినేశ్‌, ‍ఒడిశాకు చెందిన చాందినిగా గుర్తించారు. 

ఇవీచదవండి.

Last Updated : Oct 5, 2021, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.