ETV Bharat / state

childrens died: చంపావతితో మునిగి ఇద్దరు చిన్నారుల దుర్మరణం

నీరు తమ ప్రాణాలు తీస్తుందని ఆ చిట్టితల్లులు ఊహించలేదు. కళ్ల ముందే ఆడుతూ పాడుతూ తిరిగే కనుపాపలు అందని లోకానికి వెళ్లారన్న సమాచారం ఆ కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. చంపావతి నదిలో స్నానానికి దిగిన ఇద్దరు చిన్నారులు గుంతలో మునిగి దుర్మరణం చెందారు. ఈ విషాధ ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ఎం.వెంకటాపురంలో చోటుచేసుకుంది.

two children's died  at m.venkatapuram
చంపావతితో మునిగి ఇద్దరు చిన్నారుల దుర్మరణం
author img

By

Published : Jun 22, 2021, 8:34 AM IST

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ఎం.వెంకటాపురంలో విషాదం నెలకొంది. స్థానిక చంపావతి నది గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన సబ్బి శివ, మంగ దంపతుల కుమార్తె భవిష్య(4). పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన మంగ అక్క రాము కుమార్తె హారిక(11)తో కలసి ఇటీవల ఇక్కడికి వచ్చారు. బాలికలు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వెంకటేశ్వర ఆలయం పక్కనుంచి చంపావతి నదిలో రాళ్ల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం భోజనానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చిన్నారులను వెతికారు. ఇంతలో నదిలో బాలికలు మునిగిపోయారంటూ స్థానికులు చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు వారిని బయటకు తీసి గజపతినగరం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంగ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతితో ఆ కుటుంబంలో శోక సముద్రంలో మునిగిపోయింది.

20 రోజుల వ్యవధిలో భర్త, కుమార్తె...

రాము భర్త పైడిరాజు 20 రోజుల కిందట తణుకులో మృతి చెందారు. దీంతో మంగ తన అక్క రామును తమ ఇంట్లో అడుగు పెట్టించేందుకు నాలుగు రోజుల కిందట తీసుకొచ్చింది. ఇప్పటికే భర్త దూరమయ్యాడని రోదిస్తున్న ఆమెకు ఇప్పుడు కుమార్తె మృతి మరింత వేదనకు గురిచేస్తోంది.

పాఠశాలకు పంపకుండానే...

తన పెద్ద కుమార్తెకు నాలుగేళ్లు పూర్తవడంతో ఈ ఏడాది నుంచి పాఠశాలకు పంపించాలని ఎన్నో కలలు కన్నానని, ఇంతలో దేవుడు ఇలా చేశాడంటూ మంగ రోదిస్తున్న తీరు స్థానికులను కలచి వేస్తోంది.

ఇదీ చదవండి..

పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు.. మృత్యుఒడికి చేరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.