విజయనగరం జిల్లా పెద్ద చెరువు ఎదురుగా ఉన్న అబ్దుల్ రఫీ స్క్రాప్ దుకాణంలో.. చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అబ్దుల్ రఫీ స్క్రాప్ దుకాణంలో.. గత సంవత్సరం అక్టోబరులో, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒకే తరహాలో నేరాలు జరిగి, సుమారు రూ.3.25 లక్షలు రాగి, ఇత్తడి స్క్రాప్‌ను.. గుర్తు తెలియన వ్యక్తులు దొంగిలించారు. షాపు యజమాని అబ్దుల్ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విజయనగరం 1వ పట్టణ పోలీసులు రెండు కేసులను నమోదు చేశారు. ఈ రెండు నేరాలు ఒకే తరహాలో ఉండడంతో, పాత నేరస్థులే మళ్లీ నేరాలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావించి.. హైదరాబాద్, విజయనగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు.
నిందితుల వద్ద నుంచి 150కిలోల రాగి వైరు, 50కిలోల ఇత్తడి, రెండు చరవాణీలు, టాటా ఏస్ వాహనం,రూ.లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: 'అధిక అద్దె వసూలు.. ఇదేంటని అడిగితే దౌర్జన్యం'