ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి గిరిపుత్రుల పాదయాత్ర

author img

By

Published : Nov 23, 2020, 3:53 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజనులు రెండు రోజులపాటు పాదయాత్ర నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పార్వతీపురం అభివృద్ధి సంస్థ పీఓ కూర్మనాథ్​కి వినతి పత్రం అందజేశారు.

tribes padayatra to solve problems
సమస్యల పరిష్కారానికి గిరిపుత్రులు పాదయాత్ర

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సబ్ ప్లాన్ మండలాల్లో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజనుల ఆందోళన చేపట్టారు. రెండు రోజులపాటు పాదయాత్ర నిర్వహించారు. కురపాంలో ఆదివారం ప్రారంభమైన పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం నాటికి ఐటీడీఏ కార్యాలయం చేరుకుంది. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని.. జీవో నెంబర్ 3ని యధాతథంగా అమలు చేయాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్​ చేశారు.

కురుపాంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం చేయాలని, నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని, జీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వివరిస్తూ పీవో కూర్మనాథ్​కి వినతి పత్రం అందజేశారు. సమస్యలను చూసిన ఆయన దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గిరిజన సంఘం నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

పదేళ్ల తరువాత గనుల అక్రమ తవ్వకాలకు యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.