గిరిజనుల హక్కుల కోసం విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని తుంద పంచాయితీ.. జగ్గు దొర వలస గ్రామంలో చేస్తున్న దీక్ష 50వ రోజుకు చేరుకోవడంతో గిరిజనులు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. దేశం మొత్తం సంక్రాంతి సంబురాలు జరుపుకుంటే.. వలస గ్రామ పరిసర గిరిజనులు మాత్రం తమ హక్కుల పరిరక్షణ కోసం ఇలా వినూత్న ప్రదర్శన చేపట్టారు.
తమ సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వచ్చే వరకు తాము ఎటువంటి పండుగలు చేసుకోబోమని అక్కడి గిరిజనులు తేల్చి చెప్తున్నారు. పార్వతీపురం సబ్ ప్లాన్ మండలాల్లో 1496 గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించి గిరిజనులను ఉద్యోగాల్లో నియమించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గజరాజుల బీభత్సం.. కళ్లాల్లో ధాన్యం ధ్వంసం