ETV Bharat / state

Tribal University Foundation Stone Controversy in AP స్థలం మార్పుతో.. సాధించిందేంటి?.. ప్రజాధనం వృథా తప్పా! - విభజన హామీ

Tribal University Foundation Stone Controversy in AP: గత ప్రభుత్వ హయాంలో వచ్చిన సంస్థ, ప్రాజెక్టు, పరిశ్రమ.. ఇలా ఏదైనా సరే వాటిని రద్దు చేసేయాలి. చేసే పరిస్థితి లేకపోతే.. వాటికి మన పేర్లు పెట్టుకోవాలి.. లేదా మన పార్టీ రంగులెేసుకోవాలి. ఈ విధానాన్నే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ సర్కార్.. తాజాగా గిరిజన యూనివర్శిటి ఏర్పాటులోనూ.. ఈ ఆలోచననే అమలు చేసింది. అయితే, ఈ ప్రయత్నంలో ఏం ఒరిగింది అని ప్రశ్నించుకుంటే.. రూ.40 కోట్లు వృథా అని తేలింది. ఇదే ఆనందం అంటూ.. నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Central_Tribal_University_Foundation_Stone_Controversy

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 10:42 AM IST

Tribal University Foundation Stone Controversy in AP: గత ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన చేసినా, ప్రారంభోత్సవం జరిగినా.. మళ్లీ శంకుస్థాపనలు చేయాలి. రిబ్బన్లు కత్తిరించాలి. ఈ ప్రక్రియలో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినా ఫరవాలేదు.. మన పంతం నెగ్గాల్సిందే.. అహం చల్లారాల్సిందే. గత ప్రభుత్వానికి వీసమెత్తు పేరు వచ్చినా సహించేది లేదంతే. ఇదీ వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ అనుసరిస్తున్న ఏకైక ఎజెండా.

CM Jagan Laid Foundation Stone to Central Tribal University: విజయనగరంలో కేంద్రీయ గిరిజన వర్సిటీకి శంకుస్థాపన..

విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయం విషయంలోనూ జగన్‌ ప్రభుత్వం అదే వైఖరిని అనుసరించింది. ఎప్పుడో నిర్మాణం పూర్తి కావాల్సిన ఆ ప్రాజెక్టును కేవలం గత ప్రభుత్వం స్థలం ఎంపిక చేసిందన్న కారణంతో.. మరో చోటుకు మార్చేసి, భూసేకరణ పేరుతో విపరీతంగా తాత్సారం చేసింది. దానికి అధికారంలోకి వచ్చిన దాదాపు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు సీఎం జగన్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. జగన్‌ ప్రభుత్వం పంతానికి పోకుండా గత ప్రభుత్వం ఎంపిక చేసిన చోటే కొనసాగించి ఉంటే.. ఇప్పటికే యూనివర్సిటీ నిర్మాణాలు పూర్తయి.. దానిలోనే తరగతులూ ప్రారంభమయ్యేవి. విద్యార్థులు మరికొన్నేళ్లపాటు అద్దె ప్రాంగణంలో కాలం గడపాల్సిన దుస్థితి తప్పేది.

CM Jagan Foundation Stone for 3 Renewable Energy Projects: గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రాష్ట్రాన్ని ముందుంచేలా అడుగులు : సీఎం జగన్

CM Jagan Foundation Stone for Tribal University: గిరిజన యూనివర్సిటీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు విజయనగరం గ్రామీణ మండలం కొండకరకం వద్ద ఆంధ్రా యూనివర్సిటీ స్టడీ సెంటర్‌ భవనాల్లో 2019 ఆగస్టు 5 నుంచి తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. వర్సిటీ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలోనే స్థల సేకరణ జరిగింది. 10 కోట్ల రూపాయలతో ప్రహరీ కూడా నిర్మించారు. భవన నిర్మాణ పనులు ప్రారంభించడమే తరువాయి అన్న దశలో.. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని మరోచోటుకు మార్చేసింది. అక్కడైనా నిర్మాణాలను మొదలుపెట్టిందా అంటే అదీ లేదు.

గత ప్రభుత్వానికి పేరు రాకూడదన్న కారణంతో జగన్‌ సర్కారు మోకాలడ్డకపోతే ముందు నిర్ణయించిన స్థలంలో ప్రహరీ నిర్మాణానికి గత ప్రభుత్వం వెచ్చించిన 10 కోట్ల రూపాయలు వృథా అయ్యేవి కాదు. కొత్తగా ఎంపిక చేసిన ప్రదేశంలో భూసేకరణకు రైతులకు 30 కోట్లకుపైగా చెల్లించాల్సిన అవసరమూ ఉండేది కాదు. మొత్తంగా జగన్‌ ప్రభుత్వ నిర్వాకం వల్ల యూనివర్సిటీ ఏర్పాటులో విపరీతమైన జాప్యం జరగడంతో పాటు.. 40 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం వృథా అయింది.

Tribal University Land Compensation గిరిజన విశ్వవిద్యాలయ భూమిపూజకు ఏర్పాట్లు.. తమ సంగతేంటున్న భూనిర్వాసితులు,,

Tribal University in Andhra Pradesh: గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజన ప్రాంతానికి ముఖ ద్వారమైన కొత్తవలస మండలంలోని రెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని అప్పన్నదొరపాలెం వద్ద యూనివర్సిటీ కోసం స్థలాన్ని ఎంపిక చేసింది. ఇందుకోసం 5 వందల 11.24 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. ఆ భూముల్లో కొంత.. అప్పటికే 120 మంది గిరిజనులు, గిరిజనేతరుల ఆక్రమణలో ఉండటంతో వారికి వేరే చోట ఇళ్ల స్థలాలు కేటాయించింది. యూనివర్సిటీ కోసం సేకరించిన భూమి చుట్టూ 10 కోట్ల రూపాయలతో ప్రహరీ నిర్మించింది. రవాణా వసతులు మెరుగ్గా ఉండటంతో ఆ ప్రదేశాన్ని టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది.

CM Jagan Suggests AI: టీచర్ల కొరతను ఏఐతో అధిగమించండి.. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం సూచన

గత ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఇష్టం లేని జగన్‌ సర్కార్​.. ఆ ప్రదేశం గిరిజన ప్రాంతానికి సమీపంలో లేదన్న సాకుతో మరోచోటుకు మారుస్తున్నట్టు ప్రకటించింది. మెంటాడ, దత్తిరాజేరు మండలాల పరిధిలో నిర్మిస్తామని తెలిపింది. యూనివర్సిటీకి మొత్తం 5 వందల 19.03 ఎకరాల్ని ఎంపిక చేసింది. దానిలో 4 వందల 51.73 ఎకరాల ప్రభుత్వ భూమి, 67.30 ఎకరాల జిరాయితీ భూమి ఉంది. జిరాయితీ భూముల్ని తీసుకున్నందుకు రైతులకు, డి-పట్టా భూములు ఇచ్చిన వారికి, అప్పటికే ఆ భూముల్ని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారికి 30 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించింది. ఇదంతా అదనపు ఖర్చే. 4 వందల 51 ఎకరాల ప్రభుత్వ భూమిలో కూడా 42.88 ఎకరాలు చెరువు పోరంబోకు భూమి ఉంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.