ETV Bharat / state

భార్య మృతదేహం బైక్​పై తరలింపు - జగన్ అసమర్ధ పాలనకు నిదర్శనం : నారా లోకేశ్

Travelling with wife dead body on two wheeler : కనీస సౌకర్యాలు మారుమూల గిరిజనులకు నేటికీ అందని ద్రాక్షగానే మిగిలాయి. విద్య, వైద్యం, తాగునీరు అందక గిరిజనులు పడుతున్న కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. తాజాగా ఓ గిరిజనుడు తన భార్య మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లిన హృదయ విదారక ఘటన చర్చనీయాంశమైంది. సకాలంలో వైద్యం అందక వారి ఆర్నెళ్ల కుమారుడు 10రోజల కిందటే మృతి చెందడం గమనార్హం. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు.

dead_body_on_bike
dead_body_on_bike
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2024, 1:01 PM IST

Updated : Jan 17, 2024, 1:32 PM IST

Travelling with wife dead body on two wheeler : ఓ గిరిజనుడు తన భార్య మృతదేహాన్ని ద్విచక్ర వాహనం పై తీసుకువెళ్లిన ఉదంతమిది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర పంచాయతీ శివారు గిరిశిఖర గ్రామం చిట్టంపాడు గ్రామానికి చెందిన మాదల గంగమ్మ(23) మంగళవారం మధ్యాహ్నం విశాఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త గంగులు ఈమెను ఆటోలో శృంగవరపుకోట వరకు తీసుకువచ్చాక గ్రామం వరకు రాలేమంటూ ఆటోవాలా వెనక్కి వెళ్లిపోయాడు.

భార్య మృతదేహం బైక్​పై తరలింపు - జగన్ అసమర్ధ పాలనకు నిదర్శనం : నారా లోకేశ్

గిరిజన ప్రాంతాల్లో ఆగని డోలీ మోతలు- నిండు గర్భిణిని 3కిలోమీటర్లు మోసుకెళ్లిన స్థానికులు

దీంతో పట్టణంలో స్నేహితుల వద్ద ద్విచక్ర వాహనం తీసుకొని వెనుక తమ్ముడిని కూర్చో బెట్టి మధ్యలో భార్య మృతదేహంతో కొండ దిగువ వరకు తీసుకువెళ్లాడు. తిరిగి అక్కడి నుంచి డోలీ కట్టి గ్రామానికి తరలించారు. గంగులు ఆరు నెలల వయస్సున్న బాబు ఈనెల 6వ తేదీన ఆసుపత్రిలో మృతి చెందాడు. ఇప్పుడు భార్య కూడా మరణించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడం వలన ఈ డోలీ మోతలు, సకాలంలో వైద్యం అందక ప్రాణాలు గాల్లో కలసి పోతున్నాయని గిరిజన సంఘాలు నాయకులు ఆవేదన చెందుతున్నారు.

Tribal People problems: తప్పని డోలిమోతలు.. బైక్‌కు కర్రలు కట్టి ఒడ్డుకు చేర్చిన గిరిజనులు

విశాఖ ఏజన్సీ శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ శివారు చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయ విదారక సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో అంపశయ్యపైకి చేరిన వైద్య, ఆరోగ్య రంగ పరిస్థితులకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. గ్రామంలో గంగులు, గంగమ్మ దంపతుల ఆరునెలల కుమారుడు అనారోగ్యానికి గురికాగా, ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో డోలీపై ఈనెల 5న ఎస్.కోట తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో డాక్టర్ల సూచనతో విశాఖ కెజిహెచ్ కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో 6వతేదీన ఆ చిన్నారి కన్నుమూశాడు.

గర్భిణులకు పురిటి నొప్పులు - ఏజెన్సీలో గిరిజనులకు తప్పని డోలీ మోతలు

అప్పటికే కిడ్నీవ్యాధితో బాధపడుతున్న గంగమ్మ కడుపుకోతతో తీవ్ర మానసిక క్షోభకు గురై నిన్న తుదిశ్వాస విడిచింది. గుండెబద్ధలైన గంగులు భార్య మృతదేహాన్ని ద్విచక్రవాహనంపైన కొద్దిదూరం, డోలీపైన మరికొంతదూరం అవస్థలు పడి స్వస్థలానికి తీసుకెళ్లడం రాష్ట్రంలో మారుమూల గిరిజనులు ఎదుర్కొంటున్న పరిస్థితులను కళ్లకు కడుతోందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థుడి పాలనలో గిరిజన బిడ్డలకు సరైన వైద్యం అందించడం ఎలాగూ చేతకాలేదని, కనీసం మృతదేహాన్ని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయలేరా? అని మండిపడ్డారు. ఫోన్ కొట్టిన వెంటనే కుయ్ కుయ్ అంటూ అంబులెన్స్ పరుగెత్తుకొస్తుందని గాలికబుర్లు చెప్పే ముఖ్యమంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

చందమామను అందుకున్నా - 'అక్కడ' బిడ్డను కనాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే!

Last Updated : Jan 17, 2024, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.