ETV Bharat / state

Love cheating: ప్రేమన్నారు..మోసగించారు..ఒక్కరు కాదు..! - ప్రేమ పేరుతో నమ్మించి...యువతిని వంచించి

ప్రేమించానని యువకుడు ఓ యువతి వెంట పడ్డాడు... పెళ్లి చేసుకుంటానని ఎన్నో మాయమాటలు చెప్పాడు. ఎంతో కాలం అవకాశం కోసం ఎదురుచూసి.. నగ్న ఫొటోలు సేకరించాడు.. ఆ తరువాత అమ్మాయిని బ్లాక్​ మెయిల్​ చేస్తూ.. గొడవకు దిగేవాడు... ఉద్యోగం చేస్తున్నా అక్కడకు వెళ్లి ఘర్షణ పడేవాడు. ఇదే సమయంలో సహోద్యోగి ఆసరాగా తీసుకుని అమ్మాయిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ తరువాత ఈ వ్యవహారం తెలిసిన పురోహితుడు సైతం ఆమెను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి మోసం చేశాడు... పెళ్లి సంబంధాలు సైతం చెడగొట్టాడు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు... ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది.

cheating
cheating
author img

By

Published : Jun 8, 2021, 6:07 PM IST

Updated : Jun 8, 2021, 6:31 PM IST

యువతిని ప్రేమించి మోసం చేసిన ప్రియుడితో పాటు ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి వంచించిన మరో ఇద్దరిని పోలీసులు కటకటాల్లోకి పంపించారు. యువతి భయాన్ని ఆసరా చేసుకుని ముగ్గురు వ్యక్తులు ఆమె జీవితంతో చెలగాటమాడి..కుదిరిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టిన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చేసుకుంది.

సీఐ లక్ష్మణరావు కథనం ప్రకారం..పార్వతీపురం పట్టణానికి చెందిన ఓ యువతి ఆరేళ్ల క్రితం ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ అభ్యసించింది. ఆ సమయంలో వల్లరిగుడబ గ్రామానికి చెందిన వాసుదేవరావు యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. కొంతకాలం ఇద్దరూ స్నేహంగా తిరిగారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె స్నానం చేస్తున్న ఫొటోలను సేకరించాడు. డిగ్రీ పూర్తయ్యాక యువతి ఓ ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ఆమె పట్ల ఇష్టం చూపుతూ వచ్చాడు. ప్రియుడు వాసుదేవరావు ఆమె పనిచేసే చోటకు వచ్చి తరచూ మాట్లాడుతూ గొడవ పడేవాడు. ఇది గమనించిన ఉద్యోగి యువతిని బ్లాక్‌ మెయిల్‌ చేసి శారీరకంగా లొంగదీసుకున్నాడు. కొంతకాలం బెదిరిస్తూ వచ్చాడు. ఇద్దరి నుంచి మోసపోయిన ఆమె వ్యవహారం తెలుసుకున్న పట్టణానికి చెందిన ఓ పురోహితుడు ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. యువతికి చెందిన నగ్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ బ్లాక్‌ మెయిల్‌ చేసి శారీరకంగా లొంగదీసుకున్నాడు.

CI Lakshmana Rao
సీఐ లక్ష్మణరావు

జాతకాలు చూస్తానన్నాడు..పెళ్లి జరగకుండా చేశాడు

ఇంతలో యువతికి కుటుంబ సభ్యులు ఓ సంబంధం కుదిర్చారు. ఈ విషయం తెలుసుకున్న పురోహితుడు జాతకాలు చూస్తానని చెప్పి పెళ్లి కుమారుడి కుటుంబీకుల వివరాలు సేకరించాడు. యువతి ప్రేమ వ్యవహారాలు ఆ కుటుంబ సభ్యులకు చేరవేశాడు. అయినా వారు అమ్మాయి పట్ల నమ్మకం ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న పురోహితుడు యువతి నగ్న ఫొటోలను చరవాణిలో పెండ్లి కుమారుడు కుటుంబీలకు చేరవేశాడు. వారు విషయాన్ని యువతి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి సంబంధం చెడిపో కూడదని యువతి భావించింది.. కానీ, అందుకు భిన్నంగా జరగడంతో యువతి నోరు విప్పింది. తనను మోసం చేసిన ముగ్గురు వ్యక్తుల వివరాలు తెలియజేయడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురునీ అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:

వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నిందితుల అరెస్ట్

Last Updated : Jun 8, 2021, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.