విజయనగరం జిల్లా సుంకర పేట జంక్షన్ వద్ద ప్రభుత్వ మద్యం దుకాణంలో.. దుండగులు చోరీకి ప్రయత్నించారు. రాత్రి 12 గంటల సమయంలో వైన్‌షాప్ సెక్యూరిటీ గార్డు మంచినీళ్ల కోసం వెళ్లడాన్ని గమనించారు. దుకాణం తలుపులను పగులగొట్టి 10 వైన్ పెట్టెలను బయటకు తెచ్చారు. అదే సమయంలో సెక్యూరిటీ గార్డు అక్కడికి చేరగా.. భయంతో అక్కడే పెట్టెలను వదిలిపెట్టి దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: