విజయనగరం జిల్లా పార్వతీపురంలో గతేడాది నవంబర్‌లో మార్కెట్ యార్డ్ సమీపంలో లారీ చోరీకి గురైంది. సీసీ ఫుటేజి సహాయంతో దర్యాప్తు చేయగా శ్రీకాకుళం జిల్లాలో లారీని గుర్తించినట్లు సీఐ దాశరథి తెలిపారు. టెక్కలికి చెందిన కిషోర్ అనే వ్యక్తి లారీని దొంగిలించాడన్నారు. అప్పటికే లారీకి సంబంధించి నాలుగు చక్రాలు విక్రయించాడని, నిందితుడిపై గతంలో మినీ బస్సు, వ్యాను చోరీ చేసిన కేసులు ఉన్నాయన్నారు. కిషోర్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి...