ETV Bharat / state

భోగాపురం విమానాశ్రయ నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు... పరిహారం తేల్చాలంటున్న నిర్వాసితులు

author img

By

Published : Jan 19, 2022, 12:07 PM IST

Bhogapuram Greenfield International Airport : రాష్ట్రానికే తలమానికంగా నిలవనున్న విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి వడివడిగా అడుగులుపడుతున్నాయి. ఫిబ్రవరిలో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కానీ భూ నిర్వాసితుల పరిహారం వ్యవహారం ఇప్పటికీ కొలిక్కిరాలేదు. పునరావాస కాలనీలు పూర్తికాకుండా ప్రస్తుత నివాసాలు ఖాళీ చేసేది లేదని బాధితులు చెబుతున్నారు.

Bhogapuram Greenfield International Airport

Bhogapuram Greenfield International Airport : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం పనుల్లో కదలిక మొదలైంది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీగా 15 వేల ఎకరాల్లో విశాలమైన విమానాశ్రయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. స్థానికుల ఆందోళనతో 5వేల 311 ఎకరాలకు కుదించారు. చివరకు అదికాస్తా.. 2వేల 644 ఎకరాలకు చేరింది. కంచెరుపాలెం, కవులవాడ, గూడెపువలస, ఏ.రావివలస, సవరవిల్లి, రావాడ రెవిన్యూ గ్రామాల పరిధిలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం భూసేకరణ చేసింది.

భూమిపూజకు ప్రణాళికలు..

విమానాశ్రయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఫిబ్రవరిలో భూమిపూజకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2వేల 200 ఎకరాల్లో విమానాశ్రయం PPP పద్ధతిలో నిర్మించేందుకు GMR సంస్థతో ఒప్పందం చేసుకుంది. భూసేకరణ జరిపిన ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే మౌఖికంగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికీ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వ్యవహారం ఓ కొలిక్కిరాలేదు. పునరావాస కాలనీల్లో ఒక్క ఇల్లు సైతం పూర్తికాలేదు. ఉన్నపళంగా తమను ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్తామని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

న్యాయం చేసిన తర్వాతనే ఖాళీ చేస్తాం..

విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూముల విషయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవటంపైనా బాధితులు మండిపడుతున్నారు. ఆర్.అండ్.ఆర్ ప్యాకేజీ, ఉపాధి విషయంలో అధికారులెవ్వరూ నోరు విప్పటం లేదంటున్నారు. గత హామీలు నెరవేర్చకపోగా, ఉన్న గ్రామాలను ఖాళీ చేయాలనే ప్రయత్నం సరికాదంటున్నారు. తమకు అన్ని విధాలుగా తగిన న్యాయం చేసిన తర్వాతనే గ్రామాలు ఖాళీ చేస్తామని తెగేసి చెబుతున్నారు. ఆర్.అండ్.ఆర్ పరిహారంతో పాటు జిరాయితీ భూముల్లో నిర్మించుకున్న గృహాల పరిహారంపై అధికారులు రాతపూర్వక హామీ ఇవ్వాలని నిర్వాసితులు పట్టుబడుతున్నారు.

భోగాపురం విమానాశ్రయ నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు... పరిహారం తేల్చాలంటున్న నిర్వాసితులు

ఇదీ చదవండి : SC on Community Kitchen: దేశంలో ఆకలి చావులు లేవంటారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.