విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. సైకిల్‌పై వస్తున్న ఇద్దరిని.. ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో అఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మనోజ్ అనే మరో బాలుడికి తీవ్ర గాయాలు కాగా.. జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమారుడిని కోల్పోయిన తల్లి.. కుమారుడి శవం మీద పడి విలపించటం అక్కడి వారందరినీ తీవ్రంగా కలచివేసింది.
వి. కృష్ణాపురానికి చెందిన బాలురు ఇద్దరు.. సమీపంలోని మానాపురం సంత వద్దకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలుడి కుటుంబీకులు.. ఘర్షణకు దిగారు.
ఇదీ చదవండి:
Murder: సోదరిని ప్రేమించవద్దన్నందుకు అన్న హత్య..2నెలల తర్వాత వెలుగులోకి..