ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయదినోత్సవం వేడుకలు - రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయదినోత్సవ వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అన్ని జిల్లాలో డా. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయదినోత్సవ వేడుకలు

author img

By

Published : Sep 6, 2020, 7:10 AM IST

  • విజయనగరం జిల్లాలో...

విజయనగరం పురపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ.... ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మనదేశంలో ఉపాధ్యాయులకు ఉన్నటువంటి స్థానం అత్యున్నతమైనది కొనియాడారు.

  • శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకొన్నారు. నరసన్నపేట జ్ఞానజ్యోతి జూనియర్ కళాశాలలో ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్ రుక్మాంగద రావు పాల్గొన్నారు . డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు . అలాగే నరసన్నపేట విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో సర్వేపల్లి విగ్రహానికి శాంతారావు తో పాటు పలువురు ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులర్పించారు.

  • కృష్ణాజిల్లాలో...

వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులకు నేడు బ్లాక్ డే గా మిగిల్చిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. చదువులు చెప్పే గురువులు సిమెంట్ పని చేసుకోవటం, మాస్కులు అమ్మి బతికే దుస్థితిని జగన్ కల్పించారని వాపోయారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురుపూజ దినోత్సవాన్ని ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఇతర నేతలు నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణని గుర్తుచేసుకున్నారు. ప్రతి విద్యార్థిని ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దడంలో గురువులదే ముఖ్య భూమికని ఎమ్మెల్సీ అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. తెదేపా హయాంలో మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి ఉత్సాహంతో పని చేసేందుకు తెదేపా ప్రోత్సహించిందని అశోక్ బాబు వెల్లడించారు.

  • కడప జిల్లాలో...

తల్లి దండ్రులు తరువాత అంతటి స్ధానం గురువులకు ఉందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా శనివారం కడప మునిసిపల్ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధా కృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమాజాన్ని సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దాలిసిన బాధ్యత గురువులపై ఉందని చెప్పారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధా కృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. జగన్ సర్కార్ పాఠశాలలను ఆదర్శంగా తయారు చేస్తున్నారని పేర్కొన్నారు.

  • విశాఖ జిల్లాలో...

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో విశాఖ మొదటి మేయర్ ఎన్.ఎస్.ఎన్. రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీవీఎంసి ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు నివాళులర్పించారు. విశాఖకు మొదటి మేయర్ గా చెందిన ఆయన ఎందరికో స్ఫూర్తిదాతగా, గురువుగా నిలిచారని మాధవ్ అన్నారు.

అనకాపల్లిలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు.

వేటపాలెంలో....

ఉపాధ్యాయ వృత్తికే గౌరవాన్ని, మంచి గుర్తింపు తెచ్చిన మహనీయుడు, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు... వేటపాలెం మండలం కొత్తపేటలో ఎమ్మెల్సీ పోతుల సునీత నివాసంలో సర్వేపల్లి రాధాకృష్ణన్చి త్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి

శ్రీశైలం రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి స్వల్పంగా వరద ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.