ETV Bharat / state

'రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు' - recs news

ఆర్ఈసీఎస్​లను ఏపీఈపీడీసీఎల్​లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రైతులతో కలసి తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు. రైతులకు అన్యాయం జరిగితే సహించబోమని... అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని తెదేపా నేత కిమిడి నాగార్జున అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tdp protest
తెదేపా ధర్నా
author img

By

Published : Jul 19, 2021, 5:04 PM IST

గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలను ప్రభుత్వం.. ఏపీఈపీడీసీఎల్​లో విలీనం చేస్తే ఒప్పుకోమని తెదేపా నేత కిమిడి నాగార్జున అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించబోమని... అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని అన్నారు. రాష్ట్రంలో గల చిత్తూరు, అనకాపల్లి, చీపురుపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలు(RECS) .. సొసైటీలో నడుస్తూ ఉన్నాయి. వీటిని గవర్నమెంట్​లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయాలు అమలు చేస్తోంది. ఈ విలీన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైతులతో కలసి తెదేపా నాయకులు చీపురుపల్లి మూడు రోడ్డు కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. రైతులకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతరం చీపురుపల్లిలో గ్రామీణ విద్యుత్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందించారు. ఆర్ఈసీఎస్ ప్రభుత్వంలో విలీనం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

ఆర్ఈసీఎస్​ను ఏపీ ఈపీడీసీఎల్​లో విలీనం చేస్తే రైతులపై అధిక భారం పడుతుందని కిమిడి నాగార్జున ఆరోపించారు. లేదంటే రైతుల పక్షాన తెదేపా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

FAKE EGGS: ఇవి కోడి గుడ్లు కావు..బ్యాడ్ గుడ్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.