ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి, రాష్ట్రంలోని పరిస్థితులను కప్పిపుచ్చడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. తెదేపా మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు.
ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ ఎన్-440కె వైరస్ కర్నూలు నుంచి వచ్చి దేశమంతా వ్యాపిస్తోందని జాతీయ మీడియా చెప్పింది. వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకోకుండా ఎన్440కే వైరస్ లేనేలేదని సీఎం జగన్ మాట్లాడుతున్నారు.ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే ఆయన స్పందిస్తారు? రంగుల కోసం రూ.3000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు పెట్టలేదా? మీ పార్టీ రంగులకు ఉన్న విలువ మనిషి ప్రాణంకి లేదా? తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబుపై ఆపాదిస్తున్నారు.. కరోనాతో ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి.. తెదేపా నేతలను మాత్రం అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు. కరోనా నియంత్రణపై ప్రభుత్వం చేతులెత్తేసిందని.. వైకాపా ప్రజా ప్రతినిధులే చెప్పారని సంధ్యారాణి అన్నారు. ఎన్440కే వైరస్ పై ఈ నెల 4న ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్నే చంద్రబాబు చెప్పారు. పత్రికలపై కూడా కేసులు పెడతారా? - గుమ్మడి సంధ్యారాణి
ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు దొరక్క వందలాది మంది చనిపోతున్న మాట వాస్తవం కాదా? శ్మశానాల్లో శవాలను కాల్చడానికి కూడా స్థలం లేక క్యూలు కడుతున్న మాట నిజం కాదా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త వైరస్ నుంచి ప్రజలు ప్రాణాలను కాపాడుకోవాలని, అప్రమత్తం చేయడం చంద్రబాబు చేసిన తప్పా అని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపిస్తున్న వారిపై కేసులు పెట్టడం.. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించడమేనని అన్నారు.
ఇదీ చదవండి:
హైదరాబాద్కు కర్నూలు పోలీసులు.. చంద్రబాబుకు నోటీసులిచ్చే అవకాశం!