ETV Bharat / state

హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే... సీఎం ఎందుకు స్పందించరు? - రామతీర్థ ఘటనపై నిరసనలు న్యూస్

విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రాముని విగ్రహం ధ్వంసం చేయటంపై... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరవవుతోందని తెదేపా నేతలు, భాజపా నాయకులు ఆరోపించారు. ఆలయాలపై దాడులు పెరుగుతుంటే.. సీఎం ఎందుకు స్పందించటం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

agitation
నిరసనలు
author img

By

Published : Dec 30, 2020, 3:18 PM IST

హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జగన్​కు ఏ మత విశ్వాసం ఉన్నా.. పరమతాలను గౌరవించాలన్నారు. హిందూ మతంపై ఒక పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థ క్షేత్రంలోని బోధికొండపై కోదండరాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేయటాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఏడాదిన్నరగా దేవతా విగ్రహాలు, ఆలయ రథాలు ధ్వంసం అవుతున్నాయనీ.. వీటికి పరాకాష్టగా రామతీర్థ ఘటన కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలపై వరుస సంఘటనలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని పవన్ కల్యాణ్ డిమాండ్‌ చేశారు.

భాజపా నేతల పాదయాత్ర..

రాముని విగ్రహం ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ.. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కోట నుంచి వేణుగోపాలస్వామి గుడి వరకు భాజపా నేతలు పాదయాత్ర నిర్వహించారు. హైందవ ధర్మాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అధికారులు పండితులను సంప్రదించి.. విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులను గుర్తించి, కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ చర్యలేవి..?

కోదండ రాముని విగ్రహం ధ్వంసంపై తెదేపా నేతలు ధ్వజమెత్తారు. ఘటనకు నిరసనగా నెల్లిమర్ల పుణ్యక్షేత్రం వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బుద్ధా వెంకన్న, ఇతర తెదేపా నేతలు పాల్గొన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని వైకాపా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం తప్ప ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఇటువంటి వరుస ఘటనలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖలో...

ఆంధ్రప్రదేశ్ వైఖానస యూత్ ఫోరమ్ రామతీర్థ ఘటనను తీవ్రంగా ఖండించారు. అభినవ భద్రాద్రిగా భావించే.. రామతీర్థం శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేయటం దురదృష్టకరమన్నారు. హిందువుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి వెంటనే దోషులను గుర్తించి.. కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేవాలయాల పరిరక్షణ కోసం పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: రాముడి విగ్రహం ధ్వంసం.. తల ఎత్తుకెళ్లిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.