విజయనగరం జిల్లా మహిళా రక్షక్ పోలీసులకు ఆత్మ రక్షణ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు 15 రోజుల పాటు తైక్వాండో శిక్షణ ఇవ్వనున్నట్లుగా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు. తైక్వాండో శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. మహిళల రక్షణకు, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి, వారిపై జరిగే దాడులను తిప్పి కొట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. శిక్షణ పూర్తైన తర్వాత మహిళా రక్షక్ పోలీసుల వివిధ పాఠశాల్లో విద్యార్ధినులకు తైక్వాండో శిక్షణ ఇవ్వనున్నారని వెల్లడించారు.
తైక్వాండోలో బ్లాక్ బెల్టు హొల్డర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీ టి.త్రినాధరావు, ఏఆర్డీ ఎస్పీ ఎల్. శేషాద్రి, దిశ మహిళా పోలీసులు, మహిళా రక్షక్ పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రాణాలు బలితీస్తున్న ప్రేమోన్మాదం