ETV Bharat / state

హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడగా.. గమనించిన తోటి విద్యార్థినులు ప్రిన్సిపల్, వార్డెన్​లకు సమాచారం అందించారు.

Student commits suicide in hostel room
హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Feb 25, 2021, 7:27 PM IST

విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లక్కవరపుకోట మండలం చందలూరు గ్రామానికి చెందిన గనివాడ ఎర్నమ్మ(16) స్థానిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈనెల 16న తండ్రితో కలిసి ఇంటికి వెళ్లి గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తిరిగి హాస్టల్​కు వచ్చింది.

పాఠశాలకు వచ్చిన ఎర్నమ్మ తరగతులకు వెళ్లకుండా హాస్టల్​లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తోటి విద్యార్థినులు వచ్చి చూసేసరికి గదిలో ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని విద్యార్థినులు ప్రిన్సిపల్, వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. మృతురాలి తల్లి దివ్యాంగురాలు కాగా.. తండ్రి శివ వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. కుమార్తె మృతికి కారణాలను వీరు వెల్లడించలేక పోతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు.

ఇదీ చదవండి:

స్నేహితుడిని తీసుకొచ్చేందుకని వెళ్లి... అనుమానాస్పద స్థితిలో మృతి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.