ETV Bharat / state

విజయనగరంలో వింత వ్యాధి.. పెరుగుతున్న మరణాలు..!

నీరసం ఆ తర్వాత నాలుగు రోజులకే శరీరం పచ్చగా మారడం.. ఆ కొద్ది రోజులకే మృత్యువాత పడటం ఇదీ విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కనకనపల్లిలో గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్త్తున్న వింత వ్యాధి. వరుస మరణాలకు కారణాలు తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తక్షణమే వైద్యారోగ్య శాఖ దీనిపై చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

strange disease in pachipenta
పాచిపెంటలో వింత వ్యాధి
author img

By

Published : Jan 18, 2021, 7:54 PM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఒడిశా ఘాట్ రోడ్డు సమీపంలోని కనకనపల్లిలో సుమారు నాలుగు నెలలుగా వింత వ్యాధి విస్తరిస్తోంది. ఫలితంగా గ్రామస్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. లాక్​డౌన్​ సమయంలో నలుగురు మరణించగా.. నవంబర్ ,డిసెంబర్ నెలల్లో మరో ఐదుగురు చనిపోయారు.

మృతికి కారణాలు తెలియక గిరిజనులు భయాందోళనకు లోనవుతున్నారు. పాచిపెంట పీహెచ్​సీ పరిధిలోని వైద్య సిబ్బందికి కూడా మృతికి గల కారణాలు తెలుసుకోలేకపోతున్నారు. తాజాగా గ్రామానికి చెందిన గెమ్మేల రామకృష్ణ (21) అనే యువకుడు ఆదివారం అకస్మాత్తుగా మరణించాడు. తక్షణమే వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్లొద్దన్నందుకు.. ఎస్సైపై యువకుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.