రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బాలరాజు, ఇతర సభ్యులు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సింహగిరిపై రివ్యూ నిర్వహించారు. అక్కడ నివ సిస్తోన్న ఎస్టీలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు, రిజర్వేషన్ల అమలుపై సమగ్ర అధ్యయనం జరుగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలో రోస్టర్ విధానంలో ఎస్టీ రిజర్వేషన్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తున్నట్లు కమిషన్ సభ్యులు వెల్లడించారు. కమిషన్ సభ్యుల వెంట పాడేరు, అరకు ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇదీ చూడండి: