కరోనా సమయంలో మూతపడిన పరిశ్రమలు తెరిపించాలని కోరుతూ కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పని కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కోట జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.
- వెంటనే ఆదుకోవాలి..
కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని యూనియన్ నేతలు నినాదాలు చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి విఫలయయ్యాయని సీఐటీయూ నేత టీవీ రమణ తెలిపారు.
- ఆరు నెలలు గడిచినప్పటికీ..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆదుకుంటామని ప్రకటించి 6 నెలలు గడిచినా ప్రయోజనమేమీ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌తో విజయనగరంలోని వివిధ కంపెనీల్లో సుమారు 8 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తక్షణమే కార్మికులను ఆదుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకి వినతిపత్రాన్ని అందజేశారు.
పైడితల్లి సిరిమానోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహిస్తాం: మంత్రి బొత్స