Sri Polipalli Pydithalli Ammavari Temple: ఉత్తరాంధ్ర ఇలవేల్పు.. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరు పొందిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి యాత్ర మహోత్సవ వేడుకలు విజయనగరం జిల్లా రాజాంలో వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 97వ యాత్ర మహోత్సవ వేడుకల్లో భాగంగా తొలి రోజు అయిన ఆదివారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. ఆలయ అర్చకులు వేమకోటి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు ఒడిశా, తెలంగాణతోపాటు ఉత్తరాంధ్రలో పలు జిల్లాల నుంచి భక్తులు.. తెల్లవారుజాము నుంచే తరలివస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారినికి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవో మన్మధరావు, సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ప్రసాదాలు తాగునీటి సౌకర్యం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.
శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర విజయనగరం జిల్లా రాజాంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని.. తమ మొక్కులను తీర్చుకుంటారు.
పోటెత్తిన భక్తజనం: శ్రీ పోలపల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు అన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకాలు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈవో మన్మధరావు ముందుగానే పర్యవేక్షించారు. అదే విధంగా భక్తులకు రక్షణ ఏర్పాట్లు సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. తాగునీరు, ప్రసాదం విక్రయం దగ్గర ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: