కరోనాను కట్టుదిట్టం చేయడానికి రాబోయే రెండు వారాలు అత్యంత కీలకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చెప్పారు. ఈ రెండు వారాల్లో అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన గ్రామ సచివాలయాలకు... వైకాపా తరుపున పుష్ప శ్రీవాణి, అరకు పార్లమంటరీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు దంపతులు స్ప్రేయర్లను పంపిణీ చేశారు.
జిల్లా గ్రీన్ జోన్లో ఉన్నప్పటికీ ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ రెండు వారాలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ యంత్రాంగం విధిస్తున్న ఆంక్షలు తమ మేలు కోసమేనని ప్రజలు గుర్తించాలన్నారు. ఈ రెండు వారాలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకుండా స్వీయ నిర్బంధాన్ని పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: