ETV Bharat / state

కరోనాపై ప్రచార రథాలతో అవగాహన.. వాహనాలు ప్రారంభించిన ఎస్పీ

విజయనగరం జిల్లా పోలీసులు కరోనా జాగ్రత్తలపై వివిధ పద్ధతుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మైక్స్ అండ్ లైటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రచార రథాలను ఏర్పాటు చేశారు. ఆ వాహనాలను ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు.

SP  launched the Corona Awareness vehicles in vizianagaram
కరోనా అవగాహన ప్రసార రథాలను ప్రారంభించిన ఎస్పీ రాజకుమారి
author img

By

Published : Jul 6, 2020, 4:53 PM IST

విజయనగరం మైక్స్ అండ్ లైటింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కరోనా అవగాహన ప్రచార రథాలను ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. కరోనా వ్యాప్తి చెందే క్రమం, వైరస్ ప్రభావంతో కలిగే ఇబ్బందులు, వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ వాహనాల ద్వారా వివరించనున్నారు.

అలాగే.. నాటికలు, జానపదాలు, అవగాహన రూపాలకు సంబంధించిన ప్రదర్శనలు చేయనున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించే చర్యల్లో భాగంగా విజయనగరం మైక్స్ అండ్ లైటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వాహన ర్యాలీని ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు. వీటిని 2 నెలల పాటు జిల్లా వ్యాప్తంగా తిప్పుతామని చెప్పారు.

ఇదీ చూడండి:

'నన్ను అవిటి వాడిని చేశారు... వారిని శిక్షించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.