ధర్మయాత్రలో భాగంగా రామతీర్థం వెళ్లిన సోము వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామతీర్థం యాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకోవడం సరికాదని ఆయన మండిపడ్డారు. హిందూ ఆలయాలపై దాడులను నియంత్రించాలని కోరారు. ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి రాజీనామా చేయాలని సోము వీర్రాజు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రామతీర్థం జంక్షన్లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో సోము వీర్రాజు