విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పారమ్మ కొండ పరిసర గిరిజనులు.. శివ పార్వతుల విగ్రహాలను ఘనంగా విహరింపజేశఆరు. కోస్ట్ వలస నుంచి చిన్న చీపురు వలస, పెద చీపురువలస, పనుకువలస మీదుగా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వారి ఆచార దిమ్స ఆటపాటలతో సందడి చేశారు.
ఏటా కార్తీకమాసం చివరి సోమవారంలో కొండపైన శివపార్వతుల విగ్రహాలకు.. వివాహ మహోత్సవాన్ని దేవాదాయ శాఖ అధికారులు ఘనంగా నిర్వహిస్తారు. అప్పటికి వారం ముందు పరిసర గ్రామాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించి పండుగ చేయడం ఆనవాయితీగా వస్తోంది. చివరి సోమవారం నాటికి కళ్యాణ మహోత్సవానికి పారమ్మ కొండ వద్దకు విగ్రహాలను చేర్చుతారు. సోమవారం పారమ్మ కొండలో శివపార్వతుల కళ్యాణం జరుగనుండగా.. సాలూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు.
ఇదీ చదవండి: